Sat Feb 15 2025 23:59:15 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ ప్రారంభం
నేడు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమయింది.

నేడు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమయింది. ఉదయం ఎనిమిది గంటలకు ఈ లెక్కింపు ప్రారంభమయింది. ఈ ఎన్నికలో 1,437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం ఐదు టేబుళ్లను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమయింది.
రెండు పార్టీలూ...
ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరుపున నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీ చేశారు. మార్చి 28వ తేదీన పోలింగ్ నిర్వహించారు. రెండు పార్టీలు గోవాలో క్యాంపులను నిర్వహించి తమ ఓటర్లను నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలించాయి. గెలుపుపై ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ధీమాగా ఉన్నాయి. మరి ఎవరిని గెలుపు వరిస్తుందన్నది చూడాల్సి ఉంది.
Next Story