Wed Feb 19 2025 21:59:48 GMT+0000 (Coordinated Universal Time)
గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం
గాంధీ ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. 120 మందికి కరోనా సోకడంతో ఆందోళన రేగింది

గాంధీ ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. 120 మందికి కరోనా సోకడంతో ఆందోళన రేగింది. 120 మంది వైద్యులు, హౌస్ సర్జన్లు, వైద్య విద్యార్ధులకు కరోనా సోకింది. వీరికి జరిగిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వీరికి ప్రత్యేకంగా ఐసొలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
సేవలందించే....
గాంధీ ఆసుపత్రి కోవిడ్ హాస్పటల్ గా మార్చారు. కోవిడ్ కేసులు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో గాంధీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఎంతో సేవలందించారు. కానీ ఈసారి మాత్రం వారే కోవిడ్ బారిన పడ్డారు. గాంధీ ఆసుపత్రితో పాటు ఎర్రగడ్డ మానసకి వైద్యాలయంలోనూ 57 మంది రోగులు, 9 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమయిన అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Next Story