Wed Mar 18 2026 10:46:35 GMT+0530 (India Standard Time)
కరీంనగర్ లో కరోనా అలజడి.. 43 మంది కి పాజిటివ్
కరీంనగర్ లో ఉన్న ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపింది.

తెలంగాణలో రోజువారీ కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో కరోనా అలజడి రేపుతోంది. కరీంనగర్ లో ఉన్న ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపింది. ఒకరు కాదు, ఇద్దరికి కాదు.. ఏకంగా 43 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో కాలేజీ యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించింది.
యానివర్సిరీ.....
మెడికల్ కాలేజీలో వారంరోజుల క్రితమే వార్షికోత్సవం జరిగింది. ఆ వార్షికోత్సవంలో పాల్గొన్న విద్యార్థుల్లో ఒకరిద్దరికి కరోనా లక్షణాలు ఉండటంతో.. అది అందరు విద్యార్థులకు వ్యాప్తి చెంది ఉంటుందని కళాశాల యాజమాన్యం భావిస్తోంది. కాగా.. కొందరు విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ పాజిటివ్ గా తేలడంతో.. విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
Next Story

