Mon Dec 08 2025 22:20:20 GMT+0000 (Coordinated Universal Time)
స్వల్పంగా తగ్గిన కేసులు
భారత్ లో కరోనా వైరస్ కేసులు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజులో 16,103 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు

భారత్ లో కరోనా వైరస్ కేసులు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజులో 16,103 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 31 మంది కరోనాతో మరణించారు. నిన్న ఒక్కరోజులోనే కరోనా నుంచి 13,929 మంది కోలుకున్నారు. కోలుకునే వారి శాతం 98.54 శాతంగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమే. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య రోజూ పెరుగుతుంది. ప్రస్తుతం భారత్ లో రోజువారీ పాజిటివిటీ రేటు 4.27 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు....
భారత్ లో ఇప్పటి వరకూ 4,34,86,326 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,28,65,519 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా 5,25,199 మంది ఇప్పటి వరకూ మరణించారని లెక్కలు చెబుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య బాగా పెరుగుతుంది. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 1,11,711 ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ ను అందరూ వేయించుకోవాలని, బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటి వరకూ భారత్ లో 1,97,95,72,963 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story

