Fri Dec 12 2025 12:08:15 GMT+0000 (Coordinated Universal Time)
ఫిబ్రవరిలో పీక్ కు కరోనా
జనవరిలో తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరిగే అవకాశముందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు

జనవరిలో తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరిగే అవకాశముందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఫిబ్రవరిలో మరింత పీక్ కు వెళుతుందని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం దేశమంతా ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ నెలకొందన్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో ఆ వేరియంట్ బయటపడలేదని శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఎప్పుడైనా వచ్చే అవకాశముందని ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందని ఆయన తెలిపారు.
జనవరిలో ప్రారంభమై.....
కరోెనా కేసులు తగ్గాయనుకుంటన్న సమయంలో మరో వార్త కలవరపెడుతుంది. జనవరి 15 తేదీ తర్వాత తెలంగాణలో కరోనా వైరస్ కేసులు మరింత పెరిగే అవకాశముందని, ఫిబ్రవరిలో మరింత తీవ్ర స్థాయికి చేరుతుందన్న అంచనాలు వినపడుతున్నాయని శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Next Story

