Thu Apr 25 2024 00:15:06 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో కరోనా అప్డేట్
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులో 81 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులో 81 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఎటువంటి మరణాలు సంభవించలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఎక్కువగా హైదరాబాద్ లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో 39 కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 99.49 శాతంగా నమోదయిందని అధికారులు తెలిపారు.
యాక్టివ్ కేసులు...
ఇప్పటి వరకూ తెలంగాణలో 8,39,493 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా చికిత్స పొంది 8,34,839 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 543 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని అధికారులు తెలిపారు. కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు.
- Tags
- corona virus
Next Story