Mon Dec 08 2025 15:56:30 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో కరోనా అప్డేట్
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 357 మందికి కరోనా సోకింది.

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒక్కరోజులోనే 357 మందికి కరోనా సోకింది. వీరిలో నిన్న ఒక్కరోజులోనే 440 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఎలాంటి మరణాలు సంభవించలేదని తెలిపారు. 24,339 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 357 మందికి కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
యాక్టివ్ కేసులు...
ఇక వీటిలో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండటం విశేషం. వీటిలో 165 కరోనా కేసులు హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 8,31,622 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 8,24,800 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 2,711 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
Next Story

