Sun Mar 08 2026 00:50:20 GMT+0530 (India Standard Time)
తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం
తెలంగాణ సెక్రటేరియట్ లో కరోనా కలకలం రేగింది. పదిహేను మంది అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు

తెలంగాణ సెక్రటేరియట్ లో కరోనా కలకలం రేగింది. పదిహేను మంది అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా వీరిందరికీ కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే సచివాలయంలోని అన్ని కార్యాలయాలను శానిటైజ్ చేయాలని నిర్ణయించారు.
పది హేను మందికి.....
తెలంగాణ సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖ, విద్యాశాఖ లో పదిహేను మందికి కరోనా సోకింది. విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా కూడా కరోనా బారిన పడ్డారు. సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజా కూడా కరోనా బారిన పడి హోం ఐసొలేషన్ లో ఉన్నారు.
Next Story

