Mon Feb 02 2026 05:04:36 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో భారీగా నమోదయిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు ఈరోజు భారీగా పెరిగాయి. తాజాగా 3,980 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు

తెలంగాణలో కరోనా కేసులు ఈరోజు భారీగా పెరిగాయి. తాజాగా 3,980 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,38,795 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,01,047 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 33,673 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,076 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 1,643 కేసులు నమోదయ్యాయి.
Next Story

