Thu Mar 19 2026 17:39:22 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో కొంత తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. తాజాగా 3,603 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు.

తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. తాజాగా 3,603 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,34,815 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,98,649 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 32,094 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,072 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 1,643 కేసులు నమోదయ్యాయి.
Next Story

