Mon Feb 02 2026 05:03:13 GMT+0000 (Coordinated Universal Time)
కొంచెం రిలీఫ్.. తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 3,801 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు.

తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 3,801 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,47,155 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,05,054 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 32,023 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,078 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 1,505 కేసులు నమోదయ్యాయి.
Next Story

