Thu Mar 19 2026 09:26:37 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో చాలా రోజుల తర్వాత వెయ్యికి దిగువన కేసులు
తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. తాజాగా 865 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు.

తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. తాజాగా 865 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. చాలా రోజుల తర్వాత వెయ్యికి దిగువన కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,80,836 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,56,883 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
మరణాలు కూడా...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 19,850 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,103మంది కరోనా కారణంగా మరణించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈరోజు 263కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story

