Thu Mar 19 2026 09:26:08 GMT+0530 (India Standard Time)
గుడ్ న్యూస్.. తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. తాజాగా 1,061 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు.

తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. తాజాగా 1,061 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. నెల రోజుల తర్వాత వెయ్యి కేసులకు పడిపోవడం విశేషం. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,79,971 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,54,399 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
తగ్గుతున్న యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 21,470 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,102మంది కరోనా కారణంగా మరణించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈరోజు 274 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story

