Thu Mar 19 2026 05:05:28 GMT+0530 (India Standard Time)
తెలంగాణ కరోనా అప్ డేట్
తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. తాజాగా 348 కేసులు నమోదయ్యాయి

తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. తాజాగా 348 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,87,200 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,77,202 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,396 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,109 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఈ కేసుల్లో ఒక్క హైదరాబాద్ లోనే 93 కేసులు నమోదయ్యాయి.
Next Story

