Thu Mar 19 2026 06:29:45 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో కరోనా అప్ డేట్
తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గాయి. తాజాగా 453 కేసులు నమోదయ్యాయి

తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గాయి. తాజాగా 453 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒక్క మరణం సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,85,596 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,74,742 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,746 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,108 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు
Next Story

