Thu Mar 19 2026 05:05:26 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో బాగా తగ్గుతున్న కరోనా
తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గాయి. తాజాగా 385 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు

తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గాయి. తాజాగా 385 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,86,802 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,76,802 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,787 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,109 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు
Next Story

