Sun Feb 01 2026 21:34:54 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో కరోనా అప్ డేట్
తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. తాజాగా 767 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు.

తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. తాజాగా 767 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. అతి తక్కువ కేసులు నమోదవ్వడం నెల రోజుల్లో ఇదే తొలిసారి. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,81,603 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,59,744 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
తగ్గుతున్న యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 17,754 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,105 మంది కరోనా కారణంగా మరణించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈరోజు 263కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story

