Wed Mar 18 2026 18:18:22 GMT+0530 (India Standard Time)
తెలంగాణ కరోనా అప్డేట్
తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 30 కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 30 కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,91,181 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,86,612 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 492 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,111 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 98.91 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.
Next Story

