Thu Mar 19 2026 03:38:09 GMT+0530 (India Standard Time)
భారీగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 152 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు.

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 152 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,88,931 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,83,427 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,719 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,111 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ లోనూ కేసుల సంఖ్య తగ్గుతోంది. ఈ కేసుల్లో ఒక్క హైదరాబాద్ లోనే 64 కేసులు నమోదయ్యాయి
Next Story

