Thu Mar 19 2026 10:58:49 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 2,421 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 2,421 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,71,828 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,34,628 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
గ్రేటర్ లో కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 33,104 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,096 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
Next Story

