Thu Mar 19 2026 11:00:15 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో కరోనా అప్ డేట్
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 2,098 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు.

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 2,098 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,76,313 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,42,988 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 29,226 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,099 మంది కరోనా కారణంగా మరణించారు.
Next Story

