Thu Mar 19 2026 09:41:15 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో ఆగని కరోనా
తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం లేదు. ఈరోజు కొత్తగా 4,393 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు.

తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం లేదు. ఈరోజు కొత్తగా 4,393 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,31,212 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,95,942 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 31,199 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,071మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 1,643 కేసులు నమోదయ్యాయి.
Next Story

