Thu Mar 19 2026 22:27:11 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో ఈరోజు కరోనా కేసులు?
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈరోజు 2,047 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈరోజు 2,047 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,09,209 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,83,104 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 22,048 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,057 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా 1,174 కేసులు నమోదయ్యాయి.
Next Story

