Fri Mar 20 2026 02:17:02 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో కరోనా కేసులు రెండు వేలకు చేరువలో...?
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజకూ పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 1,825 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజకూ పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 1,825 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ6,95,855 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
గ్రేటర్ లోనే....
ఇప్పటి వరకూ తెలంగాణలో 6,77,466 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 14,995 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,043 మంది కరోనా కారణంగా మరణించారు. సంక్రాంతి పండగ తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతుంది. హైదరాబాద్ పరిధిలో 1,042 కేసులు నమోదయ్యాయి.
Next Story

