Mon Feb 02 2026 02:06:15 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో బాగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. తాజాగా 2,646 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు

తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. తాజాగా 2,646 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,69,041 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,30,654 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
గ్రేటర్ లో కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 34,665 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,094 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఈరోజు 747 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story

