Thu Mar 19 2026 11:01:02 GMT+0530 (India Standard Time)
నెలరోజుల తర్వాత తెలంగాణలో కరోనా
తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. తాజాగా 1,217 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు.

తెలంగాణలో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. తాజాగా 1,217 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. నెల రోజుల తర్వాత వెయ్యి కేసులకు పడిపోవడం విశేషం. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,75,530 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,46,932 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 26,498 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,100 మంది కరోనా కారణంగా మరణించారు.
Next Story

