Thu Mar 19 2026 02:11:31 GMT+0530 (India Standard Time)
వందకు దిగువన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా 82 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు.

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా 82 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,89,758 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,83,937 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
మరణాలు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,710 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,111 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 98.86 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. హైదరాబాద్ లో అత్యధికంగా 29 కేసులు నమోదయ్యాయి.
Next Story

