Fri Jan 30 2026 22:51:26 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ కరోనా అప్డేట్
తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 25 కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 25 కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,91,246 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,86,700 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 392 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,111 మంది కరోనా కారణంగా మరణించారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గుతుండటంతో మాస్క్ ను ధరించాలన్న నిబంధనను కూడా వైద్య ఆరోగ్య శాఖ తొలగించింది.
Next Story

