Thu Mar 19 2026 07:59:33 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 614 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఎవరూ మృతి చెందలేదు.

తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 614 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఎవరూ మృతి చెందలేదు. అతి తక్కువ కేసులు నమోదవ్వడం నెల రోజుల్లో ఇదే తొలిసారి. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,84,062 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,70,047 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,908 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,108 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 98.21 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.
Next Story

