Mon Feb 02 2026 05:06:09 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో భారీగా కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 4,559 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు.

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 4,559 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,43,795 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,03,047 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
గ్రేటర్ లో....
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 36,269 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,077 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 1,605 కేసులు నమోదయ్యాయి.
Next Story

