Thu Mar 19 2026 12:36:30 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో కరోనా క్రమంగా?
తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి. తాజాగా 2,484 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి. తాజాగా 2,484 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,61,050 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,18,241 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
గ్రేటర్ లోనే...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 38,723 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,086 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 1,045 కేసులు నమోదయ్యాయి.
Next Story

