Wed Mar 18 2026 21:35:31 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా 67 కేసులు నమోదయ్యాయి

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా 67 కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,90,570 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,89,193 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 738 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,111 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.
Next Story

