Mon Jul 04 2022 06:51:08 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన కల్గిస్తుంది. తాజాగా 19,715 మంది నమూనాలను పరీక్షించగా తెలంగాణ వ్యాప్తంగా 236 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇందులో హైదరాబాద్ నగరంలోనే 180 కేసులు వచ్చాయి. హైదరాబాద్ లో వివిధ ఆందోళనలు జరగుగుతండటం, గుంపులుగా గుమికూడటం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్ లు, శానిటైజర్ల వంటివి వినియోగించకపోవడంతో కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలోనే....
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారితో కూడా కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉందన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే మరణాలు మాత్రం సంభవించడం లేదు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,96,055 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో 7,89,918 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వకూ కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 2,026 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు చెబుతున్నారు.
Next Story