Mon Mar 30 2026 13:03:28 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో పెరుగుతున్న కేసులు
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. 28,808 మంది కి కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా 496 కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించలేదు. అయితే నిన్న కరోనా బారి నుంచి 205 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 3,613 ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని, లేకుంటే మరింత కరోనా వ్యాప్తి జరుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
Next Story

