Fri Mar 20 2026 04:08:04 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో పెరుగుతున్న కరోనా
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో 156 కరోనా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో 156 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఒమిక్రాన్ కేసులతో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
యాక్టివ్ కేసు సంఖ్య....
ఇప్పటి వరకూ తెలంగాణలో 6,79,720 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 6,72,063 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 3,693 వరకూ ఉన్నాయి. కరోనా బారిన పడి తెలంగాణలో ఇప్పటి వరకూ 4,015 మరణించారు.
నలుగురి పరిస్థితి....
తెలగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ఎనిమిది మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే అది ఒమిక్రాన్ అవునా? కాదా? అన్నది ఇంకా తేలలేదు. ఒమిక్రాన్ సోకిన ఇరవైమందిలో నలుగురి పరిస్థితి ఆందోలన కరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Next Story

