Fri Apr 26 2024 07:30:46 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో కరోనా విజృంభణ
కరోనా కేసులు తెలంగాణలో భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 434 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించ లేదు
కరోనా కేసులు తెలంగాణలో భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 434 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు సంభవించ లేదు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు పూర్తిగా కోవిడ్ నిబంధనలను పక్కన పెట్టడంతోనే కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. కనీసం మాస్క్ కూడా ధరించకుండా తిరుగుతున్నారన్నారు. ఈ కారణాల వల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుంటే వైరస్ మరింత తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు.
యాక్టివ్ కేసులు...
తెలంగాణలో ఇప్పటి వరకూ 7,97,139 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడిన వారిలో 7,90,347 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ కరోనా కారణంగా 4,111 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 2,680 వరకూ ఉన్నాయి. ప్రస్తుతం నమోదయిన434 కరోనా కేసుల్లో 292 కేసులు కేవలం హైదరాబాద్ లోనివే.
Next Story