Mon Dec 15 2025 02:45:33 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో కోరలు చాస్తున్న కరోనా
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజు 1,588 కరోనా కేసులు నమోదు కావడం కలవరం కల్గిస్తుంది.

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజు 1,588 కరోనా కేసులు నమోదు కావడం కలవరం కల్గిస్తుంది. నిన్న మొన్నటి వరకూ 200 లోపే నమోదయ్యే కేసులు నేడు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లో కరోనా కేసులు 1,214 నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంక్షలను కఠినంగా అమలు చేసే దిశగా చర్యలు చేపట్టనున్నారు.
అన్ని ఆసుపత్రుల్లో...
దీంతో పాటు అన్ని ఆసుపత్రుల్లో కోవిడ్ పడకలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ, కింగ్ కోఠి ఫీవర్ ఆసుపత్రి, టిమ్స్, నిలోఫర్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం సిబ్బంది సెలవులను రద్దు చేసింది. ఇప్పటికే ప్రభుత్వం రేపటి నుంచి విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించింది. మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తుంది.
Next Story

