Fri Dec 12 2025 23:43:21 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో ఆగని కేసులు... ఆంక్షలను...?
తెలంగాణలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 2,398 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 2,398 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,05,199 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,78,466 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆంక్షలను పెంచేందుకు....
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 21,676 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,052 మంది కరోనా కారణంగా మరణించారు. సంక్రాంతి పండగ తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో సంక్రాంతి పండగ తర్వాత ఆంక్షలను మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది.
Next Story

