Mon Dec 08 2025 22:22:55 GMT+0000 (Coordinated Universal Time)
వామ్మో.. తెలంగాణాలో కరోనా
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నాలుగు నెలల తర్వాత తొలిసారి 600 కేసులు దాటాయి

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నాలుగు నెలల తర్వాత తొలిసారి 600 కేసులు దాటాయి. ఒక్కరోజులో తెలంగాణలో 608 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే ఎటువంటి మరణాల సంభవించలేదు. నిన్న ఒక్కరోజలో 459 మంది కరోనా బారి నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కరోనా మళ్లీ పంజా విసురుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలని కోరుతున్నారు.
యాక్టివ్ కేసులు...
తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 5,146 యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 8,05,137 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 7,95,880 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకూ 4,111 మంది మరణించారు. నమోదయిన కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. హైదరాబాద్ లో 329 మంది కరోనా బారిన పడ్డారు.
Next Story

