Wed Aug 10 2022 01:50:37 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ కరోనా అప్డేట్

తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం లేదు. తాజాగా 457 కేసులు నమోదయ్యాయి. నిన్న 22,384 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 457 మందికి కరోనా సోకింది. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజులో 492 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
యాక్టివ్ కేసులు...
ఇప్పటి వరకూ తెలంగాణలో 8, 02, 437 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. 7.94,202 మంది ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 4,111 మంది మరణించారు. ఐదువేలకు చేరువలో యాక్టివ్ కేసులున్నాయి. ప్రజలు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు.
Next Story