Tue Dec 09 2025 19:14:26 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులేనట
తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొత్తగా 2,447 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు.

తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొత్తగా 2,447 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,11,656 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,85,399 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 22,197 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,060 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా 1,112 కేసులు నమోదయ్యాయి. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయిన కరోనా కేసుల్లో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులున్నాయి. 92 శాతం ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. గాంధీ, ఎర్రగడ్డ, ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కూడా కరోనా బారిన అధిక సంఖ్యలో పడటం కలవర పరుస్తుంది.
Next Story

