Thu Mar 19 2026 18:58:34 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో ఈరోజు కూడా కరోనా కేసులు భారీగానే
తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈరోజు కొత్తగా 4,207 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు.

తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈరోజు కొత్తగా 4,207 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,22,403 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,91,703 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 26,633 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,067 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 1,645 కేసులు నమోదయ్యాయి.
Next Story

