Wed Mar 18 2026 21:34:34 GMT+0530 (India Standard Time)
తెలంగాణ కరోనా అప్ డేట్
తెలంగాణలో కరోనా కేసులు కొంత పెరుగుతున్నాయి. తాజాగా 75 కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు కొంత పెరుగుతున్నాయి. తాజాగా 75 కేసులు నమోదయ్యాయి. వంద కేసుల లోపే నమోదవుతున్నా మళ్లీ కొంత పెరుగుదల అధికారుల్లో ఆందోళన కల్గిస్తుంది. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,90,445 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,88,993 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
మరణాలు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 816 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,111 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.
Next Story

