Thu Mar 19 2026 11:15:50 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో ఆగని కరోనా... ఈరోజు కూడా?
తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 1,673 కేసులు నమోదయ్యాయి

తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 1,673 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 6,94,030 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
హైదరాబాద్ లోనే....
ఇప్పటి వరకూ తెలంగాణలో 6,76,466 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 13,552 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,042 మంది కరోనా కారణంగా మరణించారు. కేసులు మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతుంది.
Next Story

