Mon Dec 08 2025 04:08:39 GMT+0000 (Coordinated Universal Time)
పెరుగుతున్న కేసులు.. ఆంక్షలు మరింతగా?
తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా 3,557 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా 3,557 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,18,209 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,86,104 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 24,253 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,065 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని పలువురు కోరుతున్నారు. కనీసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి నిబంధనలను విధించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Next Story

