Wed Mar 25 2026 19:08:24 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణలో ఇప్పసారాపై రగడ
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా, ఇందిరమ్మ పేరు పై వివాదం జరిగింది

తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా, ఇందిరమ్మ పేరు పై వివాదం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ఇప్పపువ్వుకు ఇందిరమ్మ పేరు పెట్టాలని సూచించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నో మార్పులు తెచ్చిన ఇందిరమ్మ పేరును సభలో కించపర్చడమేంటని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు. సంక్షేమానికే ఇందిరమ్మ పేర్లు పెడతామని అన్నారు. మరొకవైపు ఇందిరమ్మ పేరు ఎందుకు తీసుకు వచ్చారో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు.
రాకేశ్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందే...
రాకేశ్ రెడ్డి సభకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య జరిగినగొడవ రాద్ధాంతం కావడంతో బీఆర్ఎస్ ఉప సభ పక్ష నాయకుడు హరీశ్ రావు ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టి రైతులు, గిరిజనులు, మైనారిటీలపై చర్చించాలని కోరారు. కొత్త సభ్యుడు పొరపాటు చేస్తే ఫ్లోర్ లీడర్ దానిని సరిచేయాలని కాంగ్రెస్ సభ్యులు సూచించారు. రాకేశ్ రెడ్డి సభకు క్షమాపణలు చెప్పేంత వరకూ సభ నడవదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచ ఉక్కు మహిళ ఇందిరను తాను అవమానించలేదని, ప్రభుత్వ పథకాలకు పేరుపెడుతున్న ప్రభుత్వం, దానికి ఆ పేరు పెట్టవద్దని తెలిపారు.
Next Story

