Fri Dec 05 2025 09:07:42 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యప్ప మాల వేసుకున్న డ్రైవర్ కు బ్రీత్ ఎనలైజ్ పరీక్ష.. వివాదంగా మారడంతో?
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపోలో అయ్యప్పమాల వేసుకున్న డ్రైవర్ కు బ్రీత్ ఎనలైజ్ పరీక్షలు చేయడంపై వివాదం రేగింది

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపోలో అయ్యప్పమాల వేసుకున్న డ్రైవర్ కు బ్రీత్ ఎనలైజ్ పరీక్షలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ జరిపి పరీక్షలు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. దీంతో తొర్రూరులో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
డిపోమేనేజర్ వివరణతో...
అయితే డిపో మేనేజర్ పద్మావతి మాత్రం ఈ ఘటనపై విచారణ జరుపుతామని తెలిపారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యం తమకు లేదని ఆమె వివరించారు. బాధ్యులపై తాము కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధుల్లో భాగంగా జరిగింది కావచ్చని, మనోభావాలు దెబ్బతీసేందుకు కాదని ఆమె వివరణ ఇవ్వడంతో అయ్యప్పస్వాములు దీక్ష విరమించారు.
Next Story

