Thu Jan 29 2026 17:03:01 GMT+0000 (Coordinated Universal Time)
Sachin Pilot : మార్పు ఖాయం.. కాంగ్రెస్ గెలవడం తధ్యం
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం గ్యారంటీ అని కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్ అన్నారు

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం గ్యారంటీ అని కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్ అన్నారు. ప్రజల్లో కనిపిస్తున్న స్పందన చూసి ఈ విషయం చెబుతున్నానని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపునకు కారణమవుతుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ ను చూస్తుంటే కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఇచ్చిన...
కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. ఈసారి కాంగ్రెస్ గెలుపును ఆపడం ఎవరి తరం కాదన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన అననారు. ఛత్తీస్గడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తెలిపారు. మార్పు కోరుకోవడం వల్లనే ఇది సాధ్యమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా ఫలితాలు అనుకూలంగా రావడానికి దోహదపడిందన్నారు.
Next Story

