Fri Dec 05 2025 11:34:40 GMT+0000 (Coordinated Universal Time)
మహిళ కమిషన్ ఎదుట ఉద్రిక్తత - కేటీఆర్ వాహానాన్ని అడ్డుకుని
మహిళ కమిషన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

మహిళ కమిషన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ కార్యకర్తలు పెద్దయెత్తున తరలి వచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నారు. కేటీఆర్ తెలంగాణ మహిళలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ కదలనివ్వబోమని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పోలీసులు జోక్యం చేసుకుని...
దీంతో పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్ మహిళ కార్యకర్తలను పక్కకు తీసుకెళ్లడంతో కేటీఆర్ మహిళ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు. మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన మహిళలు కూడా అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇబ్బందులే తప్ప ప్రయోజనం లేదంటూ వారు నినాదాలు చేశారు. మహిళలకు ముందు నెలకు 2,500 రూపాయలు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు.
Next Story

