Mon Dec 15 2025 08:19:28 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలో పింఛను ఎంత మొత్తం పెరుగుతుందో తెలుసా?
తెలంగాణలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను హామీలుగా ఇచ్చింది

తెలంగాణలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను హామీలుగా ఇచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది.ఇప్పటి వరకూ ఆరు గ్యారంటీలలో చాలా వరకూ ప్రభుత్వం అమలు చేసింది. ఆరు గ్యారంటీలతోనే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని నేతలందరూ చెప్పడంతో జనం కూడా నమ్మారు. కానీ అందులో కొన్నింటిని ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే అమలు చేయడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత వేగంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అందరూ భావించారు. అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వెంటనే చేసింది.
ఆరు గ్యారంటీలలో...
2018 డిసెంబరు 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిదో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్నిప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం నేటికీ విజయవంతంగా నడుస్తుంది. రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు కూడా అమలు చేసింది. రైతులకు రెండు లక్షల వరకూ రైతు రుణ మాఫీ అమలు చేసింది. మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ ను అమలు చేశారు. అయితే వెనుకబడినత తరగతులకు చెందిన మహిళలకు నెలకు రెండు వేల పథకం ఇంకా అమలు కాలేదు. వరి రైతులకు ఐదు వందల బోనస్ ను అందచేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. యువ వికాసం పథకం కింద ఐదు లక్షల విద్యాభరోసా కార్డు ను కూడా అమలు చేస్తున్నారు.
ముఖ్యమైన హామీ కావడంతో...
ఇక ప్రధానంగా త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మరొక ముఖ్యమైన హామీని అమలు చేయడానికి సిద్ధమయిందని తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉండనుందని సమాచారం. స్థానిక సంస్థలు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే వృద్ధులు, వితంతవుల పింఛను ను పెంపుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుంది? నెలకు ఎంత ఖర్చవుతుందన్న వివరాలను ముఖ్మమంత్రి కార్యాలయ అధికారులు కోరినట్లు తెలిసింది. వృద్ధులు, వితంతవులకు పొరుగు రాష్ట్రంలో నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తుండటంతో ఇక్కడ కూడా పింఛను మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది.
దాదాపు నలభై లక్షల మందికి...
తెలంగాణలో వృద్ధులు 12,30,000, దివ్యాంగులు ఐదు లక్షలు, వితంతువులు దాదాపు ఇరవై లక్షలు, నేత కార్మికులు 36,872, కల్లు గీత కార్మికులు 62,164, బీడి కార్మికులు 4,07,374, ఒంటరి మహిళలు 1,33,936, హెచ్ఐవీ రోగులు 32,718, కళాకారులు ముప్ఫయి వేల మందికి పైగానే ఉన్నారు. వీరిందరికీ పింఛను మొత్తాన్ని పెంచాల్సి ఉంది. అంటే దాదాపు నలభై లక్షల మందికి పైగా పింఛను మొత్తాన్ని పెంచాల్సి ఉంది. ప్రస్తుతం వీరికి 2,116 పింఛను ఇస్తున్నారు. నాలుగువేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. అయితే దశల వారీగా పింఛను మొత్తాన్ని పెంచుతారా? లేక ఒక్కసారే పెంచుతారా? అన్నది త్వరలోనే తేలనుంది.
Next Story

